ఆరోగ్య శ్రీ ప‌రిమితి రూ. 15ల‌క్ష‌ల‌కు పెంచుతామ‌న్న మంత్రి హ‌రీశ్‌రావు

జ‌హీరాబాద్ (CLiC2NEWS): కాంగ్రెస్ పార్టీ కర్ణాట‌క‌లో చేసిందేమీ లేద‌ని, అక్క‌డ చేయ‌లేనిది తెలంగాణ‌లో నెర‌వేరుస్తారా అని మంత్రి హ‌రీశ్ రావు అని ప్ర‌శ్నించారు. జహీరాబాద్‌లో నిర్వ‌హించిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. క‌ర్ణాట‌క‌లో రైతుల‌కు 5 గంట‌ల క‌రెంట్ ఇస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి.. ప్ర‌స్తుతం 2 గంట‌లు కూడా ఇవ్వ‌టం లేద‌ని ఆరోపించారు. 12 సార్లు ఎన్నిక‌ల్లో గెలిపించినా జ‌హీరాబాద్‌కు కాంగ్రెస్ చేసింది ఏమీ లేద‌ని ఎద్దేవచేశారు. బిఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తే.. రైతు బంధు కింద ఎక‌రాకు రూ. 16 వేలు ఇస్తామ‌ని, జ‌న‌వ‌రి నుండి అసైన్డ్ భూముల‌కు ప‌ట్టాలు ఇస్తామ‌న్నారు. అంతే కాకుండా ఆరోగ్య‌శ్రీ ప‌రిమితిని రూ.15 లక్ష‌లకు పెంచనున్న‌ట్లు మంత్రి హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.