బద్వేలు ఉప ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

బద్వేలు (CLiC2NEWS):: ఎపిలోని బద్వేలు ఉపఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 8 కు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు తెలిపారు. మొత్తం 281 పోలింగ్ బూతుల కోసం 4 హాల్స్ లో 28 టేబుల్స్ ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం లోపు పూర్తి ఫలితం వెల్లడించేలా ఏర్పాట్లు చేశారు.