గన్‌పార్క్ వద్ద ఈటల, బండి సంజయ్ దీక్ష
హైదరాబాద్ (CLiC2NEWS): గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ గన్‌పార్క్ వద్ద టిఎస్పిఎస్సి పేపర్ లీకేజి అంంపై దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజిపై త్వరగా విచారణ చేపట్టాలని.. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. దీక్షకు అనుమతి లేకుండా దీక్షకు దిగారని.. పోలీసులకు బండికి మధ్య చర్చలు కొనసాగాయి. అనంతరం దీక్ష సవ్యంగా సాగింది. అయితే దీక్షను ముగించే సమయంలో టిఎస్పిఎస్సి కార్యాలయానికి వెళ్తామని బండి సంజయ్ అనడంతో.. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు బిజెపి నేతలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతారవణం నెలకొంది. అనంతరం ఈటల రాజేందర్, బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.