పివి సింధుకు తాను స్వ‌యంగా వేసిన పేయింటింగ్‌ను బ‌హుకరించిన ఆర్టిస్ట్ వాసు

హైద‌రాబాద్ (CLiC2NEWS): టోక్యో లో జ‌రిగిన ఒలింపిక్స్ (2020)లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు భార‌త్‌కు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. అసమాన ప్రదర్శనతో భారతీయులందరినీ గర్వించేలా చేసిన సింధూ ఇంత‌కు ముందు 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు ర‌జ‌తం సాధించింది… ఇప్పుడు ఒలింపిక్స్‌లో రెండో ప‌త‌కం సాధించిన మ‌హిళగా పీవీ సింధు రికార్డు కొల‌కొల్పింది. కాగా ఇటీవల హైద‌రాబాద్ చేరుకున్న సింధూను తెలంగాణ మంత్రి శ్రీ‌నివాస్‌రెడ్డి అభినందిచారు. ఈ మ‌ధ్య‌నే సింధూ విజ‌యవాడ‌కు వెళ్లి దుర్గామాత ఆశీస్సులు పొందింది. అనంతరం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను కూడా క‌లిసింది.

ఈ క్ర‌మంలో పీవీ సింధు సాధించిన ఘ‌న‌త‌పై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపించ‌డ‌మే కాకుండా స‌త్క‌రిస్తున్నారు. తాజాగా మంచిర్యాల‌కు చెందిన ప్ర‌ముఖ చిత్ర‌కారుడు భాస్క‌ర్ల వాసు ఆదివారం ఆమె నివాసానికి వెళ్లి ఘ‌నంగా స‌త్క‌రించాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ వైస్‌ ప్రెసిడెంట్ ఆమె పతకం సాధించిన సందర్భంలోని ఫొటోను వాసు స్వ‌యంగా చిత్రించి సింధుకు బహూకరించారు. ఈ సంద‌ర్భంగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటం గర్వకారణమని అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు శివారెడ్డి, ప్ర‌ముఖ బిల్డ‌ర్ సుధాక‌ర్‌, భాస్కర్క సాయి కిర‌ణ్ ఉన్నారు.

ఆదివారం హైద‌రాబాద్‌లో పివి సింధుతో చిత్ర‌కారుడు భాస్క‌ర్ల వాసు
Leave A Reply

Your email address will not be published.