ఆర్య సమాజ్ పెళ్లిళ్లపై `సుప్రీం` కీలక తీర్పు
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఆర్యసమాజ్‌లో జరిగే పెళ్లిళ్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. ఆర్య సమాజ్ పెళ్లిళ్ల సర్టిఫికెట్లను గుర్తించబోమని కోర్టు పేర్కొంది. పెళ్లిళ్లు చేయడం ఆర్యసమాజ్ పని కాదని కోర్టు తెలిపింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ప్రేమ పెళ్లిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది.
ఓ యువకుడు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడంటూ మధ్యప్రదేశ్‌లో ఓ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తె మైనర్ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసును సవాల్ చేస్తూ ఆ యువకుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఆ బాలిక మేజరేనని.. ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వచ్చి తనను వివాహం చేసుకుందని యువకుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. తమ వివాహం ఆర్య సమాజ్ మందిర్‌లో జరిగిందని, కేంద్రీయ ఆర్య ప్రతినిధి సభ జారీ చేసిన వివహ ద్రువీకరణ సర్టిపికెట్ ను కోర్టుకు సమర్పించాడు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం.. ఆ వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను తిరస్కరించింది. “వివాహ ధృవ పత్రాలు జారీ చేయడం ఆర్య సమాజ్ పని కాదు. ఆ అర్హత వాటికి లేదు. కేవలం చట్ట పరంగా ఉన్న అధికారులు మాత్రమే ఆ సర్టిఫికెట్లను జారీ చేయాలి. మీ కేసులో అలాంటి ధ్రువపత్రాలు ఉంటే తీసుకురండి“
అని కోర్టు స్పష్టం చేసింది.