అస్సా రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్ర‌దాడి.. కర్నల్‌తోపాటు ఏడుగురు మృతి

ఇంఫాల్‌ (CLiC2NEWS): మణిపూర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్ప‌డ్డారు. అస్సాం రైఫిల్స్ జ‌వాన్ల కాన్వాయ్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ముష్క‌రులు మెరుపు దాడి చేశారు. ఈ ఘ‌ట‌ప‌లె 46 అస్సాం రైఫిల్స్‌ కమాండింగ్‌ ఆఫీసర్, ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు స‌హా ప‌లువురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భారత్‌ – మయన్మార్‌కు సరిహద్దు, చురాచంద్‌పూర్ జిల్లాలోని సింఘత్ సబ్ డివిజన్‌లో చోటు చేసుకున్నది.

శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ వెళ్తుండ‌గా.. కొందరు ముష్క‌రులు కాల్పులు, బాంబు దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో క్విక్ రియాక్షన్ టీమ్‌తో పాటు కర్నల్‌ విప్లవ్‌ త్రిపాఠితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కాన్వాయ్‌లోనే ఉన్నారు. ఉగ్రదాడిలో కర్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు ఘటనలో మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో మరో నలుగురు అస్సాం రైఫిల్స్‌కు చెందిన జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాల‌య్యాయి.

ఈ ఘటనను మణిపూర్‌ సీఎం బీరెన్‌ సింగ్ తీవ్రంగా ఖండించారు. దోషుల‌న క‌ఠినంగా శిక్షిస్తామ‌ని తెలిపారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దాడికి బాధ్య‌త వహిస్తూ ఏ ఉగ్ర‌వాద సంస్థ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Leave A Reply

Your email address will not be published.