బఠానీ తిన‌డం వ‌లన క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

బఠానీలు వీటిని సంస్కృతంలో కలయా అంటారు.
హిందీలో మటర్ అంటారు.
తెలుగులో బఠానీ గింజలు అంటారు.
లాటిన్. పైసం, సెటైవం లైన్నేయస్ అంటారు.
కుటుంబ. లెగ్యుమీనోసి.

బఠానీ గింజలను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా సాగుచేస్తారు. పచ్చి బఠానీలు కూర వండుకొని తింటాము. ఎండిన బఠానీలను పై పొట్టు తీసివేసి తింటారు.

బఠానీలు కమ్మగా తియ్యగా కొద్దిగా వగరుగా ఉంటాయి. ఎక్కువ తింటే వాతం చేస్తుంది.
మలబద్ధకాన్ని కలిగిస్తుంది.

బఠానీలో ఖనిజలవణములు..

  • కొవ్వు,
  • ఫైబర్,
  • ప్రోటీన్,
  • ఐరన్,
  • మెగ్నీషియం,
  • కాల్షియం,
  • సోడియం,
  • పోటాషియం,
  • సల్పర్.
  • పాస్పరస్,
  • కాపర్,
  • విటమిన్ A,
  • విటమిన్ B,
  • రైబో ఫ్లోవిన్,
  • ధైమిన్ b1,
  • నీకోటిన్ ఆసిడ్.

ఇందులో ఆల్కయిడ్ ట్రైగోనిల్లో ఉండును, ఇప్పుడు చలికాలంలో ఎక్కువగా తినాలనిపించే బఠానీలు స్వాధీష్టం, పౌష్టికం, దీనిని కూరగా వండుకొని తింటే చాలా ఆరోగ్యకరం.

ఏదైనా కూరలలో ఆలు, పాలకూర, టమాటో, ఇతర కూరలలో వండుకొని తింటే excellentగా కూర టేస్ట్ గా ఉంటుంది.

కానీ శరీరంలో యూరిక్ ఆసిడ్ వున్నవారు దీనిని కూరగా వండుకొని తినరాదు, దీని వలన యూరిక్ ఆసిడ్ పెరుగుతుంది.

మోకాళ్ళ నొప్పులు,నడుము, మెడ నొప్పులు వున్నవారు వీటిని తినకూడదు.

బఠానీ గింజలు మంచి బలమైన ఆహారం, దేహపుష్టి, వీర్యవృద్ధి కలుగచ్చేస్తాయి. Ulcer, హైపర్ ఆసిటీడీ, మరియు ఆకలి తక్కువగా ఉండే రోగులు దీనిని తినకూడదు.

-షేక్.బహర్ అలీ
-ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.