కేంద్ర మంత్రి కుమారుడిపై హత్య కేసు నమోదు!
లక్నో (CLiC2NEWS): యుపిలోని లఖింపూర్ ఖీరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాక సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది. ఆదివారం రైతులపై ఆశిష్ మిశ్రా కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర ఉద్రికత్తలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఆశిష్ మిశ్రాతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై రైతులు లఖింపురి ఖీరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు సహా పలువురి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ ఘటనను కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్షాలు ఖండించాయి. అయితే ఈ ఘటనతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేర్కొన్నారు. కొంతమంది ఆందోళనకారులు కత్తులు, కర్రలతో దాడి చేశారని, ఆ సమయంలో అక్కడ తన కుమారుడు ఉండి ఉంటే సజీవంగా వచ్చేవాడు కాదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ ఘటన నేపథ్యంలో స్థానికంగా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ప్రియాంకా గాంధీని అడ్డుకున్న పోలీసులు
ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయా రైతు సంఘాలు నేడు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లఖ్‌నపూ నుంచి లఖింపూర్ ఖేరి మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవపైపు బాధిత కుటుంబాలను పరామార్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధృ వాద్రాను సీతాపూర్ పోలీసులు మార్గమద్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది.
श्रीमती @priyankagandhi जी के कपड़े खींचे जा रहे हैं। पुलिस के द्वारा भोर के अंधेरे में उनके हाथ मोड़े जा रहे हैं।
मुख्यमंत्री जी ! तानाशाही लाख कर लो, हम अन्याय और नफरत के खिलाफ कुर्बानी देने वाले लोग हैं। झुकेंगे नहीं, लड़ेंगे… #लखीमपुर_किसान_नरसंहार pic.twitter.com/HZiojipujc
— UP Congress (@INCUttarPradesh) October 4, 2021