అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రద్దు చేసిన టిఎస్‌పిఎస్‌సి
హైదరాబాద్ (CLiC2NEWS): ఈ నెల 5వ తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్ (ఎఇ) అర్హత పరీక్షను రద్దు చేస్తున్నట్లు టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 833 సహాయ ఇంజినీర్ పోస్టుల భర్తీకి మార్చి 5వ తేదీన రాత పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రశ్నపత్రం లీకవడంతో ఈ మేరకు టిఎస్‌పిఎస్‌సి నిర్ణయం తీసుకుంది. 11వ తేదీన ఎఇ, టిపిబిఒ ప్రశ్నపత్రాలను టిఎస్ పిఎస్‌సిలో పనిచేస్తున్న ఎఎస్ ఒ ప్రవీణ్, సిస్టమ్ అనలిస్టు రాజశేఖర్‌లు కంప్యూటర్ నుండి దొంగలించినట్లు సమాచారం. దీనిపై కమిషన్ ఫిర్యాదు మేరకు సిసిఎస్‌లో కేసు నమోదైంది. సాధారణంగా ఏదైనా పరీక్షను నిర్వహించడానికి ముందు ప్రశ్నాపత్రం కవర్ సీలును తెరిచినా, బయటి వ్యక్తులు, అభ్యర్థుల చేతికి పరీక్ష పేపర్ వచ్చినేఆ లీకైనట్లు భావిస్తారు.