భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
AIMS: భువనేశ్వర్ లోని ఎయిమ్స్‌లో 5 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. దీనికోసం ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. కార్డియాలజి, మైక్రోబయాలజి, గ్యాస్ట్రో ఎంటరాజి, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరి, మెడికల్ ఆంకాలజి విభాగాల్లో పోస్టులు కలవు. నెలకు వేతనం రూ. 1,77,828 అందుతుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంస్/ ఎండి, డిఎం/ ఎంహెచ్ తో పాటు పని అనుభవం ఉండాలి.
అభ్యర్థులు గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తు చేసుకోవాలాలి. అన్ రిజర్వ్‌డ్ 50 ఏళ్లు, ఒబిసి 53 ఏళ్లు, ఎస్‌సి/ ఎస్టి 55 ఏళ్లకు మించకూడదు. ఈ నెల 23న ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారు.
వేదిక: డైరెక్టర్స్ బోర్డ్ రూం, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఎయిమ్స్ భువనేశ్వర్ .
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు https://aiimsbhubaneswar.nic.in/ వెబ్‌సైట్ చూడగలరు.