ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో రూ. 13 కోట్ల విలువైన బంగారం స్వాధీనం..
ముంబయి (CLiC2NEWS): అంతర్జాతీయ విమానాశ్రయంలో 22 కిలోల బంగారం పట్టుబడింది. ఛత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గత మూడు రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో పలువురు ప్రయాణికులు నుండి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ. 13.56 కోట్ల విలువ ఉంటుందని తెలియజేశారు. బంగారం స్మగ్లింగ్ చేస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరు బంగారు కడ్డీలను లోదుస్తులలో , కార్డ్‌బోర్డ్ షీట్, బెల్ట్ మొదలైన వాటిల్లో దాచిపెట్టి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినట్లు సమాచారం.