కరీంనగర్‌లో దారుణం: శిశువును కెనాల్ పక్కన విసిరేసిన దుండగులు..

హుజూరాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని తుమ్మనపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని మూడు రోజుల మగశిశువున మూటగట్టి కెనాల్ పక్కు కు విసిరేసి వెళ్లారు. వివరాల్లోకి వెళ్తే… కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి సమీపంలోని కాకతీయ కెనాల్ పక్కన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు… ఓ పసికందును విసిరేశారు. అటుగా వెళ్తున్న చొక్కారెడ్డి అనే రైతు ఆ పసికందు ఏడుపు విని దగ్గరకెళ్లి చూశాడు. ఆయనకు కెనాల్ పక్కన ఓ ముటలో మగ శిశువు కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు శిశువును స్థానిక ఆసుపత్రికి తరలించారు. శిశువు జన్మించి మూడు రోజులు అవుతుందని, శిశువు శరీరంపై గాయాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు.
కాగా గుర్తుతెలియని మగశిశువు లభ్యమైందని, ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్లు ఎసిపి శ్రీనివాస్ జీ తెలిపారు. దీనిపైకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కాగా ఘటనకు సంభించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.