నందిగామ‌లో చంద్ర‌బాబు కాన్వాయ్‌పై దాడి..

నందిగామ (CLiC2NEWS): తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు కాన్వాయ్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి రాయి విసిరాడు. దీంతో చంద్ర‌బాబు భ‌ద్ర‌తా అధికారి మ‌ధుబాబుకి గాయాల‌య్యాయి. చంద్ర‌బాబు శుక్ర‌వారం ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బాదుడే బాదుడు నిర‌స‌న రోడ్‌షో నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి రాయి విస‌రడంతో చంద్ర‌బాబు భ‌ద్ర‌తా అధికారికి గాయాల‌య్యాయి. అత‌నికి వెంట‌నే ప్ర‌థ‌మిక చికిత్సనందించారు. ఈ ఘ‌ట‌న‌తో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన కమాండోలు 12 మంది బృందంగా ఏర్ప‌డి భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు. చంద్ర‌బాబు వాహ‌నం చుట్టూ అద‌న‌పు భ‌ద్ర‌తాద‌ళాలు మోహ‌రించాయి. పోలీసులు రోడ్‌షో త్వ‌ర‌గా ముగించాల‌ని ఒత్తిడి చేశారు.

Leave A Reply

Your email address will not be published.