మామిడాకులు కోశాడని కత్తితో దాడి!

విజయవాడ (CLiC2NEWS): అడగకుండా మామిడాకులు కోశాడని కత్తితో దాడిచేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా యనమలకుదురులో చోటుచేసుకుంది. మామిడాకులు విషయంలో తలెత్తిన చిన్న గొడవ చివరకు కత్తితో దాడికి దారి తీసింది.
వివరాల్లోకి వెళ్తే.. యనమలకుదురులో మామిడాకుల కోసం అర్జునరావు అనే వ్యక్తి తన సమీప బంధువుల ఇంటిఇక వెళ్లాడు. అనుమతి తీసుకోకుండానే మామిడి చెట్టు ఆకులను కోశాడని ఆ ఇంటి యజమాని గొడవకు దిగాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అసహనానికి లోనైన ఇంటి యజమాని నాంచారయ్య కత్తితో అర్జున రావుపై దాడి చేశాడని సమాచారం. ఇది గమనించిన చుట్టు పక్కల వారు గాయపడిన అర్జున రావును పడమటలోని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.