నవీన్ భౌతిక కాయాన్ని భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు..
ఢిల్లి (CLiC2NEWS): ఉక్రెయిన్-రష్యా దాడులలో మృతి చెందిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప భౌతికకాయాన్ని స్వదేశానికి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడి ఆదేశించినట్లు తెలుస్తోంది. మార్చి 1వ తేదీన ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌లో రష్యా దాడుల కారణంగా భారత విద్యార్థి మరణించిన విషయం తెలిసినదే. దేశ భద్రతకు సంబంధించిన సంసిద్ధత, అంతర్జాతీయ పరిణామాలపై ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.