గృహలక్ష్మి దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 10..
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/Gruha-lakshmi-Scheme.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకంకు ఈ నెల 10వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలి. పేదల ఇంటి నిర్మాణానికి రూ. 3లక్షల ఆర్ధిక సాయం రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం రాయితీతో అందించనుంది. నియోజక వర్గానికి 3 వేలు చొప్పున లబ్ధిదారులకు ఈ సాయం అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింది సాయం అందిస్తారు. మహిళల పేరుమీదే ఈ పథకం సాయం అందిస్తారు. ఇంటి బేస్‌మెంట్ లెవల్, రూఫ్ లెవల్, పూర్తి ఇలా మూడు దశల్లో సాయం అందించనున్నారు.
ఆగస్టు 10వ తేదీ లోపు మీ సేవ ద్వారా కార్యాలయాల్లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పది రోజుల్లోగా వాటిని పరిశీలించి ఆగస్టు 25న లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం.