241 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్..
7 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టు
అహ్మదాబాద్ (CLi2NEWS): ఆస్ట్రేలియా జట్టు 241 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌటయింది. ఓపెనర్లుగా హెడ్, వార్నర్ బరిలోకి రాగా బుమ్రా తొలి బాల్ వేశాడు. తొలి ఓవర్లలో ఈ ద్వయం 15 పరుగులు సాధించారు. వార్నర్ 7 పరుగులు చేసి కోహ్లీకి చిక్కాడు. ఆసీస్ 2 ఓవర్లకు 28 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (15)ను బుమ్రా ఔట్ చేశాడు. స్మిత్ (4) కూడా బుమ్రా బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఆసీస్ 7 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.
[…] […]