ఆస్ట్రేలియా ఆఫర్.. భారతీయులకు ఏటా వెయ్యి వర్క్, హాలిడే వీసాలు

ఢిల్లీ (CLiC2NEWS): భారతీయులకు ప్రతి ఏటా 1000 వర్క్, హాలిడే వీసాలు అందించేందుకు అస్ట్రేలియా సిద్దమైనట్లు సమాచారం. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన అంశంలో ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 23 నుండి 26 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శఖ మంత్రి పీయూష్ గోయల్ వివరాలు వెల్లడించారు. ఆర్ధిక , వాణిజ్య సహకారంలో భాగంగా ఇరుదేశాలు చేసుకున్న ఒప్పందం (AI-ECTA) ప్రకారం .. ఉపాధి, చదువు, పర్యటన కోసం 12 నెలలపాటు ఉండేందుకు వీలుగా వీసాను జారీ చేస్తారు. ఈ వీసా ప్రక్రియ అక్టోబర్ 1 నుండి మొదలుకానుంది. దీనికి 18 నుండి 30 ఏళ్ల భారతీయ యువత దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అస్ట్రేలియా వివిధ ప్రాంతాల్లో స్థానిక నిబంధనలకు లోబడి తాత్కాలికంగా నివాసం ఉండేందుకుగాను ఏటా 1000 వీసాలు జారీ చేస్తుంది.