ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్ హఠాన్మరణం..

మెల్‌బోర్న్ (CLiC2NEWS): ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ గుండెపోటుతో మృతిచెందారు. థాయ్‌లాండ్‌లో విల్లాలోని తన గదిలో అచేతనంగా పడి ఉండటంతో విల్లా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో వార్న్ మరణించారని వైద్యులు తెలిపారు. సుమారు 15 సంవత్సరాల పాటు షేన్‌వార్న్ క్రికెట్‌లో ఆస్ట్నేలియకు విశేష సేవలందించారు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.