ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి
మెల్‌బోర్న్ (CLiC2NEWS): ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మృతి చెందాడు. క్వీన్స్ లాండ్‌లోని టౌన్‌విల్లేలో శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడని అక్కడి పోలీసులు వెల్లడించారు. అతడి మృతి పట్ల పలువురు ఆటగాళ్లు, మాజీ సహచరులు విచారం వ్యక్తం చేశారు.
రెండు ప్రపంచకప్ (2003, 2007)లు సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న సైమండ్స్ 1998లో పాకిస్తాన్‌పై అరంగేట్రం చేశాడు. 2012లో ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. 1998 నుంచి 2012 వరకు ఆస్ట్రేలియా తరఫున 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టి20ల్లో ప్రానిధ్యం వహించాడు. ఈ క్రమంలో ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ముద్ర వేశాడు.
క్రికెట్ ఆస్ట్రేలాయా చైర్మన్ లాచ్‌లాన్ హెడర్సన్ సైమండ్స్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
సైమండ్స్ మృతి పట్ల మాజీ సహచరుడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అతడి మృతి తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు.
సైమండ్స్ మరణంపట్ల ఐసిసి సంతాపం తెలిపింది.
Tragic news surrounding the former Australia all-rounder and our thoughts are with his friends and family.https://t.co/6eXiz8Mb5O
— ICC (@ICC) May 14, 2022
Vale Andrew Symonds.
We are shocked and saddened by the loss of the loveable Queenslander, who has tragically passed away at the age of 46. pic.twitter.com/ZAn8lllskK
— Cricket Australia (@CricketAus) May 15, 2022