`జెర్సీ` చిత్రంపై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ప్రశంసలు
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “జెర్సీ” మూవీపై ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి సైతం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను సైతం సాధించింది
అయితే తాజాగా ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. దాంతో ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ అమండా బెయిలీ “జెర్సీ” చిత్రం అద్భుతమంటూ ట్వీట్ చేశారు.
“నేను జెర్సీని చూశాను! ఎంతటి భావోద్వేగ ప్రయాణం. మేకర్స్ మిమ్మల్ని ఈ చిత్రంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. నాని గుడ్ జాబ్. మీరు అతనితో నవ్వుతారు, అతనితో ఏడుస్తారు. ఇందులో నాకు రైల్వే స్టేషన్ సన్నివేశం బాగా నచ్చింది” అంటూ..ట్వీట్ చేశారు.
I watched Jersey! What an emotional journey. The creators did a brilliant job of drawing you in – you back Arjun’s dreams as much as him.
Nani did a beautiful job. You smile with him, you cry with him. My favourite scene is at the train station – my fear turned to elation. 😍— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) June 26, 2021