రచయిత్రి హాన్‌కాంగ్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

Nobel Prize: దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌కాంగ్‌కు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను ఆమె తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది. రేపు (శుక్రవారం ) నోబెల్ శాంతి బహుమతి, ఒక్టోబర్ 14న అర్ధశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. నోబెల్ బహుమతి గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10లక్షల డాలర్లు) నగదును అందజేస్తారు.