పారాలింపిక్స్ షూటింగ్లో అవనికి స్వర్ణం

పారిస్ (CLiC2NEWS): పారాలింపిక్స్‌లో భారత అమ్మాయిలు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1లో అవని లేఖరా బంగారుపతకం సాధించింది. రాజస్థాన్‌కు చెందిన షూటర్ అవని.. టోక్యో పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో పసిడి గెలిచింది. అంతేకాక 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో కాంస్యం కూడా కైవసం చేసుకుంది. ఇపుడు పారిస్ పారాలింపిక్స్‌లో పసిడి బాట పట్టింది. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని సాధించింది.
మరోవైపు పరుగుపందెంలో భారత్‌కు మూడో పతకం దక్కింది. స్ప్రింటర్ ప్రీతిపాల మహిళల 100 మీ. టి 35 విభాగం ఫైనల్లో మూడో స్థానం దక్కించుకొని కాంస్య పతకం సాధించింది.