అవనిగడ్డ, రైల్వే కోడూరు జనసేన అభ్యర్థులు..

అమరావతి (CLiC2NEWS): అవనిగడ్డ, రైల్వేకోడూరు అభ్యర్థుల పేర్లను జనసేనాని పవన్‌కల్యాణ్ ఖారారు చేశారు. గురువారం పార్టీ నేతలతో చర్చించిన అనంతరం అవనిగడ్డ శాసనసభ అభ్యర్థిగా మండలి బుద్ద ప్రసాద్ పేరును ఖారారు చేశారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ను ఎంపిక చేశారు. ముందుగా ఈ స్థానానికి యనమల భాస్కరరావు పేరును ప్రకటించగా.. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. అటు తెలుగుదేశం పార్టీ నుండి కూడా అనుకూలత లేకపోవడంతో మరోసారి అధ్యయనం చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.