CBI: సాక్షులను కాపాడాలంటే అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలి

హైదరాబాద్ (CLiC2NEWS): వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును సిబిఐ కోరింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో గురువారం సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరింది. హైకోర్టు విధించిన బెయిల్ షరతులు ఆయన ఉల్లంఘించారని తెలిపింది. అవినాష్ రెడ్డి, ఇతర నిందితులు అత్యంత ప్రభావితం చేస్తే వ్యక్తులని.. వారి ఇప్పిటికే పలువురు సాక్ష్యులను ప్రభావితం చేశారు. ఈ కేసులో దస్తగిరి కీలక సాక్షి, అప్రూవర్. అతనితో పాటు కుటుంబ సభ్యులనూ నిందితులు బెదిరిస్తున్నట్లు దస్తగిరి చెబుతున్నారు. బెదిరింపులు, ప్రలోభాల నుండి దస్తగిరి , ఇతర సాక్షులను కాపాడాలంటే అవినాష్ బెయిల్ రద్దు చేయాలి అని సిబఐ కోరింది