విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ, సైబర్ మోసాలపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

మంచిర్యాల‌ (CLiC2NEWS): బెల్లంపల్లి లోని బాలికల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హై స్కూల్ అండ్ కాలేజీ విద్యార్థులకు సైబర్ నేరాలు, ఉమెన్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పై తాళ్ల గురజాల ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు ఉమెన్ సేఫ్టీ, పోలీస్ మరియు షీ టీమ్స్ ‌ఇంపార్టెంట్స్ పై గురించి తెలియ‌జేశారు. తాత్కాలిక ఆనందాల కోసం ప్రలోభాలకు, ఆకర్షణలకు గురై భవిష్యత్తు జీవితం నాశనం చేసుకోవద్దని విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాలు అలవర్చుకొని పట్టుదలతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నారు. చదువు వలనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని విద్యార్థులకు సూచించారు.

ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, పరీక్షలు ముగిసిన తరువాత తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పై, రోడ్ సేఫ్టీ లపై అవగాహనా ఉండాలన్నారు. అవగాహన కార్యక్రమంలో విద్యార్థుల తల్లితండ్రులు, టీచర్లు, 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.