8 గంట‌ల పాటు క‌విత‌ను విచారించిన ఈడి అధికార‌లు..

16న మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని క‌వితకు నోటీసులు..

ఢిల్లీ (CLiC2NEWS): ఎమ్మెల్సీ క‌విత‌ను దాదాపు 8 గంట‌ల‌కు పైగా ఈడి అధికారులు ప్ర‌శ్నించారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మైన విచార‌ణ రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగిన‌ట్లు తెలుస్తోంది.విచార‌ణ గంట‌ల త‌ర‌బ‌డి జ‌ర‌గ‌డంతో అన్ని రాజ‌కీయ పార్టీల్లో ఉత్కంఠ నెల‌కొంది. ఢిల్లీ మ‌ద్యం కుంభంకోణం కేసులో భాగంగా బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌వితకు శ‌నివారం విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసులు పంపించిన విష‌యం తెలిసిందే. క‌విత మాజీ ఆడిట‌ర్ బుచ్చిబాబు, విజ‌య్ నాయ‌ర్‌, మ‌నీష్ సిసోదియా స్టేట్‌మెంట్‌ల ఆధారంగా క‌విత‌ను ఈడీ ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. అరుణ్‌పిళ్లైతో క‌లిపి ఆమెను విచారించారు. ఈ నెల 16వ తేదీన మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు జారీ చేశారు.

ఎమ్మెల్సీ క‌విత శ‌నివారం ఈడీ విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. ఆమెతోపాటు ఆమె భ‌ర్త అనిల్, న్యాయ‌వాదులు ఉన్నారు. ఆమె కెసిఆర్ నివాసం నుండి 10 వాహ‌నాల కాన్వాయ్‌లో ఈడి ఆఫీస్‌కు చేరుకున్నారు. క‌విత‌కు మ‌ద్ద‌తుగా మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్‌, హ‌రీశ్‌రావు, కెటిఆర్ త‌దిత‌రులు ఢిల్లీలోనే ఉన్నారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఢిల్లీ పోలీసులు భారీగా మోహ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.