ఎపి అసెంబ్లీ స్పీక‌ర్‌గా అయ్య‌న్న పాత్రుడు ఏక‌గ్రీవ ఎన్నిక‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ అసెంబ్లీ స్పీక‌ర్‌గా అయ్య‌న్న పాత్రుడు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఎపి శాస‌న‌స‌భ శుక్ర‌వారం కొలువుతీరింది. నూత‌న ఎమ్మెల్యేల‌తో ప్రొటెం స్పీక‌ర్ బుచ్చ‌య్య చౌద‌రి ప్ర‌మాణ చేయించారు. అనంత‌రం అయ్య‌న్న పాత్రుడు స్పీక‌ర్ ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆ ప‌ద‌వి కోసం ఒకే ఒక నామినేష‌న్ రావ‌డంతో ఆయ‌న ఎన్నిక ఏక‌గ్రీవమైంది.

తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత అయిన అయ్య‌న్న పాత్రుడు ఎపి అసెంబ్లీ స్పీక‌ర్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న ఎన్‌టిఆర్ పార్టి పెట్టిన ఏడాది 1983లో తొలిసారి న‌ర్సీప‌ట్నం నుండి విజ‌యం సాధించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక సారి అన‌కాప‌ల్లి ఎంపిగా కూడా విజ‌యం సాధించారు. ప‌లు శాఖ‌ల‌కు మంత్రిగా ప‌నిచేశారు.

Leave A Reply

Your email address will not be published.