అయోధ్య: ఇక `బాలక్ రామ్`గా దర్శనం

అయోధ్య (CLiC2NEWS): అయోధ్యలోని నవ నిర్మిత భవ్య మందరింలో రామయ్య కొలువు దీరాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య గర్భాలయంలో జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుక చూసి దేశ ప్రజలు పులకించిపోయారు.
కాగా ఆలయం ప్రతిష్ఠించిన రామ్ లల్లాను ఇక మీదట `బాలక్ రామ్` గా పిలవనున్నారని ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు.
“నిన్న (జనవరి 22న) ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహానికి `బాలక్ రామ్`గా పేరు పెట్టాం. రామచంద్రమూర్తి ఐదేళ్ల పసిబాలుడిగా దర్శనమిస్తున్నారు. అందుకే ఈ పేరును నిర్ణయించాం. ఇక పై ఈ ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తాం“ అని ఆలయన పూజరి అరుణ్ దీక్షిత్ పేర్కొన్నారు.
అలాగే మంగళవారం నుంచి బాలరాముడి దర్శనానికి సామాన్య భక్తులను అనుమతించారు. అలాగే హారతి వేళ్లల్లో కూడా మార్పులు చేసినట్లు ట్రస్ట్ కు చెందిన అచార్య మిథిలేశ్ నందిని శరణ్ తెలిపారు. ఇకపై రోజుల ఆరుసార్లు హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.