నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో వింత శిశువు జననం!

కఠిహార్ (CLiC2NEWS): బిహార్ కఠిహార్ జిల్లాలో సర్ధార్ ఆసుపత్రి సందర్శకులతో నిండిపోయింది. ఈ ఆసుపత్రిలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. దాంతో మంగళవారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఎందుకంటే ఈ ఆసుపత్రిలో ఓ మహిళ నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ శిశువును చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
ఆసుపత్రి బెడ్‌లో తల్లి కూర్చున్నప్పుడు ఒడిలో ఉంచిన రంగురంగుల షీట్లతో నిండిన బట్టల మధ్యన నవజాత శిశువు విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. కాగా గర్భాధారణ సమయంలో కడుపులో పెరుగుతున్న కవలలకు సరైన ఎదుగుదల లేకపోవడంతో ఇలా జరిగిందని.. శిశువు దివ్యాంగుడని సదర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మరోవైపు చికిత్సలో డాక్టర్ల లోపం కూడా ఉందంటూ గర్భిణి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.