పుదీనాలో వున్న ఔషద గుణాలు..

పుదీనాలో ఔషాదలు గుణాలు పుష్కలంగా వున్నాయి. అలాంటి ఔషాద గుణాల్లో కొన్నింటికి గురించి చెప్పుకుందాం.

  •  పుదీనా ఆకులు నలిపి వాసన చూస్తే తల తిరగటం తగ్గుతుంది.
  •  పుదీనా ఆకుల చూర్ణం ప్రతి రోజు మజ్జిగలో పది గ్రాములు వేసుకొని తాగితే దంతాల నొప్పి తగ్గుతుంది. వడ దెబ్బకు గురికాకుండా కాపాడుతుంది.
  •  పుదీనా పచ్చడి భోజనంలో కానీ ఇడ్లీ లో కానీ కలిపి తింటే తిన్నది చక్కగా జీర్ణం అవుతుంది. ఆపానవాతం, పులిత్రేపులు, వికారం తగ్గటంతో పాటు జీర్ణ శక్తి పెరుగుతుంది. రుచి తెలియనితనం పోతుంది.
  •  ఆకులు అప్పడప్పుడు నమిలి తింటూ ఉంటే చిగుళ్ళు నొప్పులు తగ్గుతాయి.
  •  పలుచటి పుదీనా కాషాయంతో పుక్కిలి పడితే గొంతు నొప్పి తగ్గుతుంది.
  •  పుదీనా చూర్ణం, లేదా పచ్చడి భోజనం చేసేటపుడు వేడి అన్నంలో మొదటి ముద్ద కలిపి తింటే జిర్ణవ్యవస్థకు సంబందించిన అన్ని సమస్యలు మాటుమయం అవుతాయి. ఇప్పుడు లేటెస్ట్ గా పుదీనా tea కూడా తాగుతున్నారు, ఇది గొంతుని క్లియర్ చేస్తుంది.

బహార్ అలీ
ఆయుర్వేద వైద్యుడు.

Leave A Reply

Your email address will not be published.