వర్షాకాలంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాకాలంలో వర్షాలు పడటం వలన వర్షపు నీరు మురికి కాలువలు, వాగులు, వంకలలో ప్రవహించి చివరకు అన్ని వర్షపు నీరు మొత్తం చెరువులలో కలవటం జరుగుతుంది. దీని వలన చెరువులో నీరు ఎర్రగా మారటం జరుగుతుంది. దీనిని శుభ్రం చేసుకొని వేడి చేసి చల్లార్చి వడ పోసుకొని తాగాలి.
ఈ వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్,swine ఫ్లూ, మలేరియా, డెంగీ, కరోనా వైరస్,food poision, డయెరియా, గ్యాస్ సమస్యలు వస్తాయి.లేటెస్ట్ గ అపరిశుభ్రత వలన మంకీ ఫాక్స్ జబ్బులు ఇలాంటి రోగాలు రాకుండా మనం వర్షాకాలంలో ఎలా ఉండాలి. వీటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
1. వైరల్ ఫీవర్స్.. వర్షాకాలం రాగానే వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. మరియు దగ్గు, జలుబు రావటం జరుగుతుంది. ఈ వైరల్ ఫీవర్స్ ఎవరికైనా వయస్సుతో సంబంధం లేకుండా వస్తాయి. చిన్న పిల్లలకు వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వలనవస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం, వాంతులు, విరోచనాలు, గొంతు గరగర తలనొప్పి ఇలాంటి లక్షణాలు కనపడతాయి.
వైరల్ ఫీవర్ రావటానికి కారణాలు:
కలుషితమైన, దుషితమైన నీరు, ఆహారం తీసుకోవటం, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం. ఎవరైనా వైరల్ ఫీవర్స్ వున్న వారి దగ్గర ఉండటం వలన వారికీ రావటం, జరుగుతుంది.
వైరల్ ఫీవర్స్ రాకుండా ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఉడికించిన ఆకు కూరలు, కూరగాయలు, తీసుకోవాలి. దూషితమైన నీరు, ఆహారం నుండి తప్పించుకోవాలి. వేడి చేసి చల్లార్చి వడ పొసిన నీరు మాత్రమే తాగాలి. వర్షాకాలంలో దినచర్య, రాత్రిచర్య, చక్కగా ఉండాలి. కాలాన్ని బట్టి ఆహారనియమాలు పాటించాలి. ఆహారం వేడిగా వున్నపుడే తినండి.
బయట రోడ్ల మీద దొరికే పిజ్జా, బర్గర్, పిస్తా, నూడిల్స్, స్నాక్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియ, హోటలో దొరికే తినుబండరాలు తీసుకోరాదు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
వర్షపు నీరు ఇంటి చుట్టుపక్కల నిల్వ ఉంటే వాటిని తొలిగించాలి. బ్లీచింగ్ పౌడర్, చల్లాలి. దోమలు రాకుండా చెత్త, చదారం తొలిగించాలి. కొబ్బరి చిప్పల్లో నీరు ఉంటే వాటిని అక్కడి నుండి తొలిగించాలి.
ఇంట్లో శుభ్రంగా డేటల్ తో తుడుచుకోవాలి. ఇంటి మొత్తలకు వున్న కటన్స్ లో, కిటికీలలో దోమలు లేకుండా చూసుకోవాలి.
వర్షకాలంలో మనం తడిసి వస్తే శుభ్రంగా తుడుచుకోవాలి.బట్టలు ఉతికినవి, శుభ్రంగా ఉండాలి, ఇస్త్రీ చేసుకున్న బట్టలు తొడగాలి.
వర్షాకాలంలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటే జ్వరం, అలర్జీ జబ్బులు వస్తాయి. ఇమ్మ్యూనిటి కొరకు చక్కని ఆహారం, చక్కని వ్యాయామం, చక్కని నిద్ర చాలా అవసరం దీనితో ఎటువంటి వైరల్, బాక్టీరియా జబ్బులు రావు.
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు
Some really great articles on this web site, thank you for contribution. “Always aim for achievement, and forget about success.” by Helen Hayes.