తిరుపతిలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ బహిరంగ సభ
తిరుపతి (CLiC2NEWS): తిరుపతి లో మూడు రాజధానులకు మద్దతుగా జరిగిన భారీ బహిరంగ సభలో “ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు” అంటూ నినాదాలు వెల్లువెత్తాయి. తిరుపతి ఇందిరా మైదానంలో మేధావులు, విద్యార్థి సంఘాలనేతలు, మహిళలు పెద్ద ఎత్తున బహిరంగ సభలో పాల్గొన్నారు. రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. అభివృద్ధి అన్నది ఒకే ప్రాంతానికి పరిమితమయితే మిగాతా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని స్పష్టం చేశారు. సిఎం జగన్ చెప్పిన సమగ్రాభివృద్ధి బిల్లుకు తామందరం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ బహిరంగ సభలో రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమాన్, రచయిత శాంతి నారాయణ, కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సిహెచ్ చంద్ర శేఖర్‌రెడ్డి, కుందూ పోరాట సమితి అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, చిత్తూరు. కడప, కర్నూల్, అనంతపురం నుండి ప్రతినిధులు, మేధావులు హాజరయ్యారు.