సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌కు ఖ‌రీదైన గిప్ట్ ఇచ్చిన బాల‌కృష్ణ‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌కు భారీ కానుక‌ను అందించారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఖ‌రీదైన పోర్షే కారును గిప్ట్‌గా ఇచ్చారు. త‌మ‌న్ ప్ర‌తిభ‌ను అభినందిస్తూ.. కెరీర్ ప‌రంగా మ‌రెన్నో విజ‌యాలు అందుకోవాల‌ని ఆశీర్వ‌దించారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో డిక్టేట‌ర్, అఖండ‌, వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి , డాకు మ‌హారాజ్ సినిమాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ న‌గ‌రంలోని క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో ఆంకాల‌జి యూనిట్ ప్రారంభోత్స‌వంలో త‌మ‌న్ గురించి బాల‌కృష్ణ మాట్లాడారు.

వ‌రుస‌గా నాలుగు హిట్లు ఇచ్చిన త‌మ్ముడికి ప్రేమ‌తో కారు బ‌హుమ‌తి ఇచ్చాన‌న్నారు. బాల‌కృష్ణ న‌టిస్తున్న కొత్త చిత్రం అఖండ 2 కి కూడా త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. డాకు మ‌హారాజ్ ఈవెంట్లో త‌మ‌న్‌కి కొత్త పేరు పెట్టారు. నంద‌మూరి త‌మ‌న్ కాదు.. ఎన్‌బికె త‌మ‌న్ అంటూ .. అస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.