వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం ద‌క్కించుకున్న తొలి న‌టుడు

హైద‌రాబాద్ (CLiC2NEWS): టాలీవుడ్ అగ్ర‌ హీరో బాల‌కృష్ణ‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. వ‌రల్డ్ బుక్ ఆప్ రికార్డ్స్ (Gold Edition) లో ఆయ‌న పేరు నిలిచింది. ఆయ‌న సినీ ఇండస్ట్రీకి వ‌చ్చి 50 వ‌సంతాలు పూర్త‌యినా కూడా ఇప్ప‌టికీ హీరోగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు బాల‌కృష్ణ ఈ అరుదైన అవార్డుకు ఎంపిక‌య్యారు. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఈ పుర‌స్కారానికి ఎంపికైన తొలి న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ కావ‌డం విశేషం. ఈ నెల 30వ తేదీన హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆయ‌న‌ను స‌త్క‌రించ‌నున్నారు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారం అందించిన సంగ‌తి తెలిసిందే. 1974లో మెద‌లైన ఆయ‌న సినీ జీవితం.. పౌరాణికం, జాన‌ప‌దం, సాంఘికం సైన్స్ ఫిక్ష‌న్, బ‌యోపిక్.. ఇలా అన్ని జాన‌ర్ల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన న‌టుడు బాల‌కృష్ణ‌.

Education News: JNTU: ఈ నెల 26 నుండి మిగిలిన సీట్ల భ‌ర్తీకి స్పాట్ అడ్మిష‌న్స్‌

2 Comments
  1. […] Also Read: వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థా… […]

  2. […] Also Read : వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థా… […]

Leave A Reply

Your email address will not be published.