బాలాపూర్ లడ్డూ.. రికార్డు ధర
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/Balapur-Laddu.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ గణేశ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నిమజ్జనోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ముఖ్యమంగా హైదరాబాద్‌లో గణేశ నిమజ్జనోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి.
నగరంలోని బాలాపూర్ గణేశ్ లడ్డూ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సంవత్సరం బాలాపూర్ గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఇవాళ జరిగిన వేలం పాటలో గణేశ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను 24.60 లక్షలకు దక్కించుకున్నాడు. పోటాపోటీగా జరిగిన వేలంపాటు ముగ్గురు స్థానికేతరులు, ఆరుగురు స్థానికులు పోటీ పడ్డారు. ఎంతో ఉత్కంఠగా సాగిన వేలంలో లక్ష్మారెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నాడు. ఈకార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.