బాలాపూర్ వినాయకుడి లడ్డూ రూ. 30 లక్షలు

బాలాపూర్ (CLiC2NEWS): ఎప్పటిలాగా హైదరాబాద్ బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటలో రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సంవత్సరం శంకర్రెడ్డి అనే అతను రూ. 30 లక్షల 1000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నాడు. వేలం పాట అనంతరం ఉదయం 11 గంటలకు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం అయింది.
ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ లడ్డూ వేలం పాట 1994వ సంవత్సరం నుంచి కొనసాగుతోంది. తొలుత రూ. 450 తో ప్రారంభం అయిన ఈ వేలంపాట 2016 లో 14.5 లక్షలు, 2017లో 15.60 లక్షలు, 2018 లో 16.60 లక్షలు, 2019లో రూ. 17.60 లక్షలు, 2021లో రూ. 18.90 లక్షలు, 2022లో రూ. 24.60 లక్షలు పలికింది. బాలాపూర్ చౌరస్తాలోని బొడ్రాయి వద్ద ఈ వేలం పాటను నిర్వహించడం మొదటినుంచి ఆనవాయితీగా వస్తోంది.
తప్పక చదవండి: గంగమ్మ ఒడికి మహాగణపతి