వైసీపీకి బాలినేని రాజీనామా

ఒంగోలు (CLiC2NEWS): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపారు. పార్టీ నాయకుడి విధానలు నచ్చే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు బాలినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు..
గత కొంత కాలంగా వైసీపీ నాయకత్వం వద్ద అసంతృప్తి చేస్తూనే ఉన్నానని తెలిపారు. అలాగే రేపు జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ను కలబోతున్నాని తెలిపారు. జనసేనలో చేరబోతున్నానని బాలినేని ఈ సందర్భంగా తెలిపారు.