వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/GODDESS-BALCAMPET-ELLAMMA.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు అమ్మవారి కల్యాణోత్సవం ప్రారంభించారు. ఈ కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపునుండి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏటా ఆషాడ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం నిర్వహిస్తారు. అమ్మవారి కాల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రేపు సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తారు.