వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం
హైదరాబాద్ (CLiC2NEWS) : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు జంటనగరాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కల్యాణ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.