వైభ‌వంగా బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ల్యాణోత్స‌వం

హైద‌రాబాద్ (CLiC2NEWS): బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ త‌ల్లి క‌ల్యాణోత్స‌వ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. తెలంగాణ స‌ర్కార్ ఈ క‌ల్యాణ మ‌హోత్స‌వాని్న వైభ‌వంగా నిర్వ‌హిస్తోంది. క‌ల్యాణ క్ర‌తువు ఇవాళ ప్రారంభ‌మైంది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున రాష్ట్ర మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. భ‌క్తులు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. వేడుక‌లకు పోలీసు శాఖ‌ భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసింది.

Leave A Reply

Your email address will not be published.