బండ్లగూడ జాగీర్ గణపతి లడ్డూ @ రూ. 1.87 కోట్లు

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌లో గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. ఏకంగా కోటిన్నరకి పైగా ధర పలికింది. హైదరాబాద్ నగర పరిధిలోని బండ్లగూడ జాగీర్ లో గణేశుడి లడ్డూ కొత్త రికార్డు సృష్టించింది. కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో జరిగిన వేలం పాటలో గణేశుడి లడ్డూ ఏకంగా రూ. 1.87 కోట్లకు దక్కించుకున్నారు. విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిపి దీన్ని కైవసం చేసుకున్నారు. గతంలో ఇక్కడి గణేశుడి లడ్డూ వేలంలో రూ. 1.26కోట్ల భారీ ధర పలికింది.