‘బంగార్రాజు’ చిత్రం సంక్రాంతికే విడుదల

హైదరాబాద్(CLiC2NEWS): కొవిడ్ కారణంగా పలు సినిమాల విడుదల వాయిదా పడుతున్న నేపథ్యంలో.. ‘బంగార్రాజు’ చిత్రం జనవరి 14వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు విడుదల తేదీని ఖరారు చేసింది. మీడియా సమావేశంలో చిత్రబృందం వివరించింది. ఇదే రోజు విడుదల కావలసిన ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం విడుదల వాయిదా పడిన సంగతి తెలిసినదే. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా వస్తుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు.