బ్యాంకులో డిపాజిట్ రూ. 50 వేలు మించితే పాన్ తప్పనిసరి: ఆర్ బి ఐ
న్యూఢిల్లీ (CLiC2NEWS): రేపటి నుండి బ్యాంకుల్లో రూ. 2వే నోట్ల మార్పిడి ప్రారంభమవుతుంది. రూ. 2 వేల నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లను చేసుకోవడానికి బ్యాంకులకు మర్గదర్శకాలను జారీ చేసినట్లు ఆర్ బి ఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. నగదు నర్వహణలో భాగంగానే రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుటున్నట్లు శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
ఈ నెల 23వ తేదీ సెప్టెంబర్ 23 వరకు నుండి రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి అవకాశమిచ్చిన విషమం తెలిసిందే. అయితే రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లకు పాన్ తప్పనిసరని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. ఈ నిబంధన ఇప్పటికే ఉన్నట్లు.. అది రూ. 2000 నోట్ల డిపాజిట్‌కు కూడా వర్తిస్తుందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
సెప్టెంబరు 30 నాటికి దాదాపు గా రూ. 2 వేల నోట్లు ఖజానాకు చేరుతాయని ఆశిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఈ నోట్ల మార్పిడి టైంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఆర్ బి ఐ చర్యలు తీసుకుంటుందని అన్నారు.రేపటి నుంచి బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు బ్యాంకుల్లో తగినంత నగదు అందుబాటులో ఉంచామని తెలిపారు. చాలామణిలో ఉన్న కరెన్సీలో రూ. 2 వేల నోట్ల వాటా కేవలం 10.18 శాతం మాత్రమే అని దాస్ స్పష్టం చేశారు.
రూ. 2000 నోట్లు ఉపసంహరణ.. ఆర్‌బిఐ కీలక నిర్ణయం