బ్యాంకులకు వరుసగా సెలవులు! ఎప్పుడెప్పుడంటే..?

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు వ‌రుస సెల‌వులు ఉన్న‌ట్లు బ్యాంకు ఉన్న‌తాధికారులు తెలిపారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి త‌మ అవ‌స‌రాల‌కు ఇబ్బంది రాకుండా చూసుకోవాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేశారు. ఆదివారాలు, పండుగ ప‌ర్వ‌దినాలు కాకుండా రెండో, నాలుగో శ‌నివారాలు బ్యాంకుల‌కు సెల‌వులు. ఆగస్ట్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి. ఈ 15 రోజుల సెలవులు గెజిటెడ్ సెలవులతోపాటు.. వారాంతాను కూడా కలిగి ఉంటాయి. ఇందులో 8 రాష్ట్రాల వారిగా సెలవులు ఉండగా.. మిగిలిన 7 వారాంతాపు సెలవులు.

ఆర్బీఐ బ్యాంకు సెలవులను 3 వర్గాలుగా విభజించింది.

  1. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలీడే,
  2. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే,
  3. బ్యాంకు క్లోజింగ్ హాలీడే ఉంటాయి.

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద పండుగ సెలవులు వస్తాయి. ఆగస్ట్ నెలలో ఆదివారాలు, రెండు, నాలుగో శనివారంతో పాటు పండుగల రోజులు సెలవులు ఉంటాయి.

బ్యాంకుల సెలవులు.. పరిశీలిస్తే..

  • 13-08-2021 – దేశభక్తుల దినోత్సవం (ఇంఫాల్)
  • 14-8-2021 – రెండవ శనివారం
  • 15-8-2021 – ఆదివారం
  • 16-8-2021 – పార్స్ న్యూ ఇయర్ (షహెన్‌షాహి) / (బేలాపూర్, ముంబై, నాగపూర్)
  • 19-8-2021 – ముహర్రం (అశూర) / (అగర్తలా, అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్)
  • 20-8-2021 – ముహర్రం/మొదటి ఓనం (బెంగళూరు, చెన్నై, కొచ్చి, తిరువనంతపురం)
  • 21-8-2021 – తిరువోనం (తిరువనంతపురం, కొచ్చి)
  • 22-8-2021 – ఆదివారం
  • 23-8-2021 – శ్రీ నారాయణ గురు జయంతి (తిరువనంతపురం, కొచ్చి)
  • 28-8-2021 – నాల్గవ శనివారం
  • 29-8-2021 – ఆదివారం
  • 30-8-2021 – జన్మాష్టమి (శ్రావణ్ వడ్ -8)/కృష్ణ జయంతి (అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, పాట్నా, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, గ్యాంగ్‌టాక్)
  • 31-8-2021 – శ్రీ కృష్ణ అష్టమి (హైదరాబాద్)
Leave A Reply

Your email address will not be published.