Bank of Maharastra: 400 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం..
పుణె (CLiC2NEWS): బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో 400 మేనేజర్ పోస్టులకు రేపటి నుండి దరఖాస్తులను స్వీకరించనున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ బ్యాంకు శాఖల్లో 400 ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 13 నుండా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్-3 పోస్టులు 100.. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులు 300 ఉన్నాయి. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా సిఎ, సిఎంఎ, సిఎఫ్ ఎ ఉత్తీర్ణత కలిగి ఉండి, పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తులు చేయడానికి చివరి తేదీ జులై 25గా నిర్ణయించారు. అభ్యర్థులు 25 నుండి 38 ఏళ్లు వయస్సు మధ్య ఉండాలి. నెలకు స్కేల్-3 పోస్టులకు రూ. 63,840 నుండి రూ. 78,230.. స్కేల్-2 పోస్టులకు రూ. 48,170 నుండి రూ. 69, 810 గా ఉంది. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది.