బన్సీలాల్‌పేట్ మెట్లబావిని ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/BANSILALPET-STEP-WELL.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని బన్సీలాల్‌పేట్ మెట్ల బావిని రాష్ట్ర మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ప్రారంభించారు. 3 శతాబ్దాల క్రితం నాటి మెట్ల బావిని సహిత స్వచ్చంద సంస్థ సహకారంతో జిహెచ్ ఎంసి పునరుద్ధరించింది. పురాతన బివి మరమ్మతులు చేసి, విద్యుత్ దీపాలంకరణతో పర్యాటక కేంద్రంగా ఆధునీకరించారు. చెత్తా చెదారంతో పూడుకుపోయిన ఈ బావి పునరుద్ధరణ పనులను 2021 ఆగస్టు 15న ప్రారంభించారు. పూడికతీత తొలగింపు సమయంలో లభ్యమైన వివిధ రకాల పరికరాలను ప్రదర్శన కోసం గ్యాలరీ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. నిరంతరం శ్రమించి ఈ మెట్ల బాది పునరుద్ధరణకు సహకరించిన వారందరికీ అభినందనలు తెలిపారు. టన్నులకొద్దీ చెత్తను తొలగించిన పారిశుద్ధ కార్మికులకు,జిహెచ్ ఎంసి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ బావిని కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులదేనన్నారు. మరో 43 మెట్ల బావులను ఆధునీకరిస్తామని మేయర్ తెలిపినట్లు కెటిఆర్ పేర్కొన్నారు.