హరియాణా స్వాతంత్య్ర వేడుకల్లో `బతుకమ్మ`

గురుగ్రామ్: హరియాణా రాష్ట్ర ప్రభుత్వం గురుగ్రామ్‌లో 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈల‌యితే ఈ వేడుక‌ల్లో తెలంగాణ బతుకమ్మ సాంస్కృతిక ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్ర‌ద‌ర్శ‌న అక్క‌డి వారినంద‌రిని ఆక‌ట్టుకుంది. కాగా ఈ వేడుక‌కు ముఖ్య‌ అతిథిగా హాజరైన ఆ రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ జాతీయ జెండాను ఆవిష్కరించి కళాకారులను అభినందించారు. ఈ వేడుక‌లో తెలంగాణ బ‌తుక‌మ్మ సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటుచేయ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.