బిసి బంద్.. ఎక్కడికక్కడ నిలిచిన ఆర్టీసి బస్సులు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిసి జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ కొనసాగుతోంది. రిజర్వేషన్లలో బిసిలకు న్యాయమైన వాటా కోసం జరుగుతున్న ఈ బంద్‌కు రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దుతుపలికాయి. ఈ బంద్‌లో కాంగ్రెస్, బిఆర్ ఎస్, బిజెపి , సిపిఐ, సిపిఎం సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించడంతో పాటు నిరసన కార్యక్రమాల్లో కూడా అన్ని పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
నిలిచిన బస్సులు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ముందు బిసి సంఘాలకు ఆందోలనలు నిర్వహించాయి. దాంతో బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి.
రాజధాని హైదరాబాద్ లోని దిల్‌సూఖ్‌నగర్, కూకట్‌పల్లి సికిందద్రాబాద్, జూబ్లీ బస్టాండ్ సహా అన్ని డిపోల వద్ద బిసి సంఘాలు ధర్నా నిర్వహించాయి.
సికింద్రాబాద్ లో నిర్వహించిన ఆందోళనల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్‌తో పాటు మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. జూబ్లీ బస్టాండ్ వద్ద బిజెపి ఎంపి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు.
జిల్లాల్లో కొనసాగుతున్న బంద్
జిల్లాల్లో కూడా బంద్ కొనసాగుతోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఈ బంద్ కు మద్దతుగా దుకాణదారులు కూడ స్వచ్ఛంధంగా బంద్ లో పాల్గొన్నారు.
మరో వైపు బంద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర డిజిపి సూచించారు.
Also Read: ఈ నెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జనవరి కోటా విడుదల
[…] బిసి బంద్.. ఎక్కడికక్కడ నిలిచిన ఆర… […]