బ్యూటి విత్ గోల్డెన్ హార్డ్.. ఇద్దరు విద్యార్థినిలకు ‘సంయుక్త’ సర్ప్రైజ్ గిఫ్ట్..
హైదరాబాద్ (CLiC2NEWS): సినీనటి సంయుక్త ఇద్దరు కాలేజి అమ్మాయిలకు సర్ప్రైజ్ బహుమతి ఇచ్చారు. ఓ అమ్మాయికి స్కూటీని బహుమతిగా ఇచ్చారు. మరో అమ్మాయికి త్వరలో అందిస్తానన్నారు. విరూపాక్ష చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా హీరో సాయిథరమ్ తేజ్, సంయుక్తతోపాటు చిత్రబృందం ఓ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఆ షోలో తేజ్‌కు స్కూటి గెలుచుకున్నారు. కానీ ఆ స్కూటీని షో లో పాల్గొన్న అమ్మాయిలకు ఇవ్వాలనుకున్నారు. ఆ అమ్మాయిలలో సింగిల్ పేరెంట్ ఉన్న ఇద్దరు అమ్మాయిలను సెలెక్ట్ చేసుకొని ఒకరికి బైక్‌ను ఇచ్చారు. మరొకరికి తానే స్వయంగా కొనిస్తానని మాటిచ్చారు.
స్కూటీని బహుమతిగా పొందిన ఆ ఇద్దరి సంతోషంతో సంయుక్తను ఆలింగనం చేసుకున్నారు. దీంతో నెటిజన్లు బ్యూటి విత్ గోల్డెన్ హార్డ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల విరూపాక్ష దర్శకుడు కార్తిక్‌కు ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.